శ్రీరామ జయం
ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి
చెంగళరావుపేట శ్రీ సీతారామస్వామి ఆలయం కోసం భక్తులు కలిసి చేపట్టిన ప్రయత్నమే రామదండు.
శ్రీరామ జయం
చెంగళరావుపేట శ్రీ సీతారామస్వామి ఆలయం కోసం భక్తులు కలిసి చేపట్టిన ప్రయత్నమే రామదండు.
చెంగళరావుపేట, విశాఖపట్నం
ఆలయ విశేషాలు, భక్తి కార్యక్రమాలు అందరికీ చేరేలా రామదండు పనిచేస్తోంది.
తరతరాలుగా వినిపిస్తున్న కథ
పాత రికార్డుల్లో ఉన్న విషయాలతో పాటు స్థానికంగా తరతరాలుగా చెబుతున్న కథలను కూడా ఇక్కడ చదవొచ్చు.
శ్రీరామ కుటుంబం
శ్రీ కోదండరామస్వామి, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీ ఆంజనేయస్వామి అనుగ్రహంతో.
స్పష్టమైన గమనిక
రామదండు పేరుతో ఎవరైనా నగదు, యూపీఐ లేదా బ్యాంకు బదిలీ అడిగితే స్పందించవద్దు.
నామస్మరణ
గానం వినాలంటే కింద ఉన్న బటన్ నొక్కండి. కావాల్సినప్పుడు అక్కడే ఆపొచ్చు.
చెంగళరావుపేట శ్రీ కోదండరామ అలియాస్ శ్రీ సీతారామస్వామి దేవస్థానం కోసం భక్తులు కలిసి చేపట్టిన ధర్మ పరిరక్షణ ప్రయత్నమే రామదండు.
రామదండు భక్తులు నిర్వహించే స్వచ్ఛంద వేదిక ఇది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిక వెబ్‌సైట్ కాదు.

సేవకు సారథ్యం
ధర్మకర్త మండలి సభ్యురాలు • రామదండు కార్యక్రమాలకు సారథ్యం
1992లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ సభ్యురాలిగా మూడు దశాబ్దాలకు పైగా న్యాయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆలయ ధర్మకర్త మండలి సభ్యురాలిగా రామదండు కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్నారు.
కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్, తమిళనాడ్ మర్కంటైల్ బ్యాంక్, అప్పటి ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్, సింహాచలం దేవస్థానం సహా పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సెల్‌గా సేవలందించారు.
వి9 ఇంటర్వ్యూ భాగం చూడండిచెంగళరావుపేట, విశాఖపట్నం
చెంగళరావుపేటలో తరతరాలుగా భక్తుల ఆదరణ పొందుతున్న శ్రీ సీతారామస్వామి ఆలయం ఇది.
స్థలపురాణం
ఈ ఆలయం క్రీ.శ. 1540 నాటిదని స్థానికంగా తరతరాలుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన పాత పత్రాలు, రికార్డుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.
సీతారామ విగ్రహాలు కేరళ తీరంలో సముద్రంలో లభించాయని స్థలపురాణం చెబుతోంది.
లక్ష్మణస్వామి విగ్రహం విషయం శ్రీరాముడు స్వప్నంలో తెలిపారని కూడా తరతరాలుగా చెబుతున్నారు.
ధర్మస్వరూపుడైన శ్రీరామునికి భక్తిపూర్వక నమస్కారం.
కరుణామయి శ్రీ సీతాదేవికి భక్తిపూర్వక నమస్కారం.
సేవా నిష్ఠకు ప్రతీక అయిన శ్రీ లక్ష్మణస్వామికి నమస్కారం.
అచంచల రామభక్తుడైన శ్రీ ఆంజనేయస్వామికి నమస్కారం.
శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామికి భక్తిపూర్వక నమస్కారం.
భక్తికి మార్గం చూపిన శ్రీ గోదాదేవికి నమస్కారం.

నిత్య పారాయణం
పాఠాలను స్తోత్రనిధి, వైదిక విజ్ఞానం తదితర తెలుగు మూలాలతో సరిపోల్చి సిద్ధం చేశాం.
ఆలయ విశేషాలను నమోదు చేయడం, భక్తి కార్యక్రమాలను తెలియజేయడం, ప్రసారాలను ఒకచోట చేర్చడం రామదండు ప్రధాన పని.
రామదండు ఎలాంటి విరాళాలు అడగదు. ఈ సైట్‌లో చెల్లింపు లింకులు, యూపీఐ వివరాలు లేదా బ్యాంకు ఖాతాలు ఉండవు.
రాబోయే కార్యక్రమాలు
అందరికీ ఆహ్వానం. హాజరయ్యే భక్తులు రామదండు వాట్సాప్ గ్రూపులో చేరి తమ పేరును నమోదు చేయండి.

వీడియో మొదలైతే శ్రీరామ నామస్మరణ గానం ఆగుతుంది. మళ్లీ వినాలంటే కింద ఉన్న గానం బటన్ నొక్కండి.
రామదండు చిత్రాలు




ఆలయ కార్యక్రమాలు, సేవా సమాచారం తెలుసుకోవడానికి గ్రూపులో చేరండి.
వాట్సాప్‌లో చేరండిగ్రూపులో చేరిన తర్వాత మీ ఫోన్ నంబర్ ఇతర సభ్యులకు కనిపించవచ్చు.
క్యూ.ఆర్. కోడ్ స్కాన్ చేయండి